వేసవిలో ఇంటిని కూల్‌గా మార్చే చిట్కాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:56 AM
బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఇంటి లోపలికి రాగానే కళ్లకు, మనసుకు చల్లగా అనిపించేలా అలంకరణలో కొన్ని మార్పులు...
బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఇంటి లోపలికి రాగానే కళ్లకు, మనసుకు చల్లగా అనిపించేలా అలంకరణలో కొన్ని మార్పులు చేయాలి. దీనివల్ల ఏసీలు, కూలర్ల వాడకం తగ్గడమే కాకుండా ఇంటికి కొత్త లుక్ వస్తుంది.
లేత రంగుల మ్యాజిక్: కిటికీలకు ఉన్న ముదురు రంగు కర్టెన్లు తీసేసి, తెలుపు, ఆఫ్‌వైట్ లేదా స్కైబ్లూ వంటి లేత రంగుల కాటన్ లేదా లెనిన్ కర్టెన్లు వాడండి. ఇవి సూర్యరశ్మిని ప్రతిబింబించి గదిని చల్లగా ఉంచుతాయి.
ఇండోర్ వాటర్ ఫౌంటెన్: హాల్‌లో ఒక చిన్న టేబుల్‌టాప్ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోండి. నీటి గలగల శబ్దం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, గాలిలోని వేడిని కొంత వరకు తగ్గిస్తుంది.
మట్టివస్తువులు: ప్లాస్టిక్ లేదా మెటల్ అలంకరణ వస్తువుల కంటే మట్టితో చేసిన బొమ్మలు, పూల కుండీలు వేసవిలో చూడటానికి చల్లగా ఉంటాయి. సెంటర్ టేబుల్‌పై ఒక వెడల్పాటి మట్టి పాత్రలో నీళ్లు పోసి, అందులో కొన్ని తాజా పూలు వేస్తే ఆ రూపు మారిపోతుంది.
ప్రకాశవంతమైన వెలుతురు వద్దు: వేడి పుట్టించే పాతకాలపు బల్బులను మార్చి ఎల్‌ఈడీ బల్బులు వాడండి. సాయంత్రం వేళల్లో తక్కువ వెలుతురు ఉండేలా చూసుకుంటే గది ఉష్ణోగ్రత తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..