Share News

ఇల్లు శుభ్రం చేస్తున్నారా..!

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:12 AM

ఇల్లు సర్దేటప్పుడు అలాగే శుభ్రం చేసేటప్పుడు అనుసరించే కొన్ని విధానాల వల్ల ఒక్కోసారి శ్రమ పెరగడమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అలాకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

ఇల్లు శుభ్రం చేస్తున్నారా..!

ఇల్లు సర్దేటప్పుడు అలాగే శుభ్రం చేసేటప్పుడు అనుసరించే కొన్ని విధానాల వల్ల ఒక్కోసారి శ్రమ పెరగడమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అలాకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

  • చాలామంది పరుపులు, దిండ్లు, సోఫాసెట్లను శుభ్రం చేసేటప్పుడు వాటిపై చేత్తో గట్టిగా తడుతుంటారు. దుప్పట్లు, రగ్గులను గట్టిగా దులిపేస్తుంటారు. దీనివల్ల వాటిపై పేరుకున్న దుమ్ము కణాలు పైకి లేచి ముక్కు, కళ్లు, నోట్లోకి వెళుతుంటాయి. ఫలితంగా తుమ్ములు రావడం, కళ్ల ఎరుపెక్కి దురదగా అనిపించడం అందరికీ అనుభవమయ్యే ఉంటుంది. ఆ దుమ్ము.. పక్కనే వున్న ఫర్నిచర్‌పై పడడంతో వాటిని కూడా తుడవాల్సి వస్తుంది. కాబట్టి వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో బెడ్‌, సోఫాలను మెల్లగా క్లీన్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. వారానికోసారి దుప్పట్లు, దిండు కవర్లను వేడినీళ్లలో నానబెట్టి ఉతకాలి.

  • ఇంట్లో అరలు, కిటికీలు, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్‌ను తుడవడానికి ఒకే గుడ్డ లేదా స్పాంజ్‌ను ఉపయోగించడం మంచిది కాదు. ప్రతిదానికి వేర్వేరు వాటిని వాడడం ఉత్తమం. పని పూర్తయిన తరువాత వాటిని లిక్విడ్‌ డిటర్జెంట్‌ లేదా సర్ఫ్‌తో శుభ్రం చేసి పొడిగా ఆరబెట్టాలి. లేదంటే వాటిపై హానికారక బ్యాక్టీరియాలు పెరిగి.. మరోసారి వాడినప్పుడు వస్తువుల్లోకి వాటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల్ని కలిగిస్తాయి.

  • గదుల్లో బూజు, దుమ్ము దులిపేటప్పుడు కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి. లేదంటే ఆ దుమ్ము కణాలు ఇంట్లో వ్యాపించి శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి.

  • వంటగది, స్టవ్‌, కిచెన్‌ సింక్‌, వాష్‌ బేసిన్లను శుభ్రం చేసేటప్పుడు ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లోవ్స్‌ ధరించడం మంచిది. లేదంటే క్లీనర్స్‌లో ఉండే రసాయనాల వల్ల అరచేతులు మండడం, గొంతునొప్పి, తలనొప్పి లాంటి సమస్యలు రావచ్చు.

  • చివరగా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ని విడదీసి దానిలో పేరుకున్న మట్టి, దుమ్ము తదితరాలను తొలగించి శుభ్రంగా తుడిచి భద్రపరచుకోవాలి.

ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 06:12 AM