అధిక బరువు తగ్గదా?
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:20 AM
మీ వయసు వాళ్లలో బరువు తగ్గకపోవడానికి ప్రధాన కారణం ‘టెస్టోస్టిరాన్’ హార్మోన్ లోపం. ఈ హార్మోన్ తగినంత స్రవించకపోవడం మూలంగా శరీర మెటబాటిజం రేటు తగ్గుతుంది....
కౌన్సెలింగ్
డాక్టర్! నా వయసు 25. ఈమధ్య ఎంత వ్యాయామం చేస్తున్నా, ఎన్ని ఆహార నియమాలు పాటిస్తున్నా నా శరీర బరువు తగ్గట్లేదు. వైద్యుల సూచన మేరకు థైరాయిడ్, ఇతరత్రా పరీక్షలు చేయించాను. రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అయితే మరి నా అధిక బరువు తగ్గకపోవడానికి కారణమేంటి?
ఓ సోదరుడు, హైదరాబాద్
మీ వయసు వాళ్లలో బరువు తగ్గకపోవడానికి ప్రధాన కారణం ‘టెస్టోస్టిరాన్’ హార్మోన్ లోపం. ఈ హార్మోన్ తగినంత స్రవించకపోవడం మూలంగా శరీర మెటబాటిజం రేటు తగ్గుతుంది. దాంతో శక్తి శరీరంలోనే నిల్వ ఉండిపోతూ, బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ సమస్యకు చికిత్స టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావాన్ని పెంచడమే! ఇందుకోసం వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుని హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటే, ఆ విషయాన్ని వైద్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి. అలాంటి వారికి నేరుగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వకుండా పరోక్షంగా చికిత్స చేస్తారు. పిల్లల కోసం ప్రయత్నిస్తూ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లను నేరుగా తీసుకుంటే ఆ ప్రభావం పునరుత్పత్తి వ్యవస్థ మీద పడి పిల్లలు కలగకపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యులతో మీ పరిస్థితి గురించి చెప్పాలి.
డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్,
ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్.