Share News

పసుపు ఐస్‌ క్యూబ్స్‌తో...

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:49 AM

చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో పసుపు ఐస్‌ క్యూబ్స్‌ ఎలా తోడ్పడతాయో చూద్దాం...

పసుపు ఐస్‌ క్యూబ్స్‌తో...

చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో పసుపు ఐస్‌ క్యూబ్స్‌ ఎలా తోడ్పడతాయో చూద్దాం...

  • వెడల్పాటి గిన్నెలో గ్లాసు మంచినీటిని తీసుకుని అందులో చెంచా కస్తూరి పసుపు, చెంచా గులాబి నీళ్లు, చెంచా అలోవెరా జెల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ట్రేలో పోసి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫ్రిజ్‌లో ఉంచితే పసుపు ఐస్‌ క్యూబ్స్‌ సిద్ధమవుతాయి.

  • వీటిని పలుచని చేతి రుమాలులో చుట్టి దానితో ముఖంపై వృత్తాకారంలో కింది నుంచి పైకి మృదువుగా రుద్దాలి. అలాగే మెడ భాగంలో కూడా చేయాలి. కనీసం పది నిమిషాలు ఇలా మర్దన చేసిన తరువాత అయిదు నిమిషాలు ఆగి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపైన మెత్తటి తువాలుతో ముఖాన్ని అద్ది మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

  • ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తుంటే పసుపులోని కర్కుమిన్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ప్రభావవంతంగా పనిచేసి మొటిమలు, నల్లమచ్చలను మాయం చేస్తాయి. చర్మం బిగుతుగా మృదువుగా మారుతుంది. చల్లటి ఐస్‌తో మర్దన చేయడం వల్ల ముఖంపై రక్తప్రసరణ మెరుగుపడి సహజమైన మెరుపుదనం చేకూరుతుంది. చర్మ రంధ్రాలను శుభ్రం చేసి వాటిని మూసివేయడంలో ఐస్‌ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. తగినంత తేమ అందడంతో చర్మం చక్కగా నిగారిస్తుంది.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 12:50 AM