Share News

రోజ్‌ వాటర్‌తో ప్రయోజనాలెన్నో..!

ABN , Publish Date - Mar 30 , 2026 | 03:12 AM

ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా రోజ్‌ వాటర్‌ను ఉపయోగిస్తూ ఉంటాం. రకరకాల ఫేస్‌ ప్యాక్‌లలో...

రోజ్‌ వాటర్‌తో ప్రయోజనాలెన్నో..!

ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా రోజ్‌ వాటర్‌ను ఉపయోగిస్తూ ఉంటాం. రకరకాల ఫేస్‌ ప్యాక్‌లలో కూడా కలుపుతూ ఉంటాం. రోజ్‌ వాటర్‌ అందించే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

  • ఒక్కోసారి శిరోజాలు పొడిబారి నిర్జీవంగా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు శిరోజాలపై కొద్దిగా రోజ్‌వాటర్‌ స్ర్పే చేసి దువ్వెనతో నెమ్మదిగా దువ్వాలి. వెంటనే కుదుళ్లు తేమతో నిండి శిరోజాలు నల్లగా మెరుస్తాయి. రోజ్‌వాటర్‌కు కొద్దిగా బాదం ఆయిల్‌ కలిపి రాస్తే శిరోజాలు సిల్కీగా ఉంటాయి.

  • రాత్రి పూట నిద్ర సరిగా పట్టకపోయినా, పని ఒత్తిడి ఎక్కువైనా, ఎండలో తిరిగినా కళ్లు అలసిపోయి ఎర్రగా మారుతుంటాయి. అలాంటప్పుడు చల్లటి రోజ్‌వాటర్‌ చిలకరించిన దూది వుండను కళ్లపై ఉంచుకుని పావుగంటసేపు విశ్రాంతి తీసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • ఎండగా ఉన్నప్పుడు బయటికి వెళితే కొంతమందికి చర్మం ఎర్రగా కందిపోతూ ఉంటుంది. ఒక్కోసారి దురద, మంట కూడా ఏర్పడవచ్చు. అలాంటప్పుడు చిన్న గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జును తీసుకుని అందులో మూడు చెంచాల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి, చేతులకు పట్టించాలి. పది నిమిషాల్లో చర్మం మామూలు స్థితికి వస్తుంది.

  • ఒక్కోసారి పెదాలపై లిప్‌బామ్‌ రాసినప్పటికీ అవి పొడిబారి గరుకుగా మారుతుంటాయి. అలా ఎండినట్లుండే పెదాలపై కొద్దిగా రోజ్‌వాటర్‌ను చిలకరిస్తే తగినంత తేమ అంది అవి మృదువుగా మారతాయి.

ఈ వార్తలు కూడా చదవండి

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్

Updated Date - Mar 30 , 2026 | 03:13 AM