ప్రొటీన్ షేక్స్‌తో గండం
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:39 AM
మితిమీరిన ప్రొటీన్ షేక్స్ స్టిరాయిడ్ల కంటే వేగంగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. శరీరానికి ప్రొటీన్ అవసరాన్ని అంచనా వేయకుండా నచ్చినంత ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం ప్రమాదకరమని...
పారాహుషార్
మితిమీరిన ప్రొటీన్ షేక్స్ స్టిరాయిడ్ల కంటే వేగంగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. శరీరానికి ప్రొటీన్ అవసరాన్ని అంచనా వేయకుండా నచ్చినంత ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.క్రమం తప్పకుండా ప్రొటీన్ పౌడర్లు తీసుకునే 71 వేల మందిని 29 ఏళ్ల పాటు పరిశీలించిన యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో కిడ్నీ డిసీజ్ డైరెక్టర్, డాక్టర్ రిచర్డ్ జాన్సన్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను కనిపెట్టారు. అదనపు ప్రొటీన్‌ు పౌడర్ల వల్ల మూత్రపిండాల సామర్థ్యం క్షీణిస్తున్నట్టు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు 89ు పెరుగుతున్నట్టు కనిపెట్టారాయన. 25 నుంచి 50 గ్రాముల వే ప్రొటీన్‌తో మూత్రపిండాల్లో నైట్రోజన్ వ్యర్థాలు పెరుగుతున్నట్టు కూడా హెచ్చరిస్తున్నారు డాక్టర్ రిచర్డ్. ఈ ప్రొటీన్‌ను వడగట్టడం కోసం మూత్రపిండాలు రెట్టింపు కష్టపడవలసి వస్తుంది. సాధారణంగా మన మూత్రపిండాలు ఆహారం ద్వారా జీర్ణమవడానికి 4 గంటల సమయం పట్టే 50 గ్రాముల ప్రొటీన్‌ను ఒక రోజులో వడగట్టగలుగుతాయి. కానీ ప్రొటీన్ షేక్ అరగంటలో 40 గ్రాముల ప్రొటీన్‌ను రక్తంలో కలుపుతుంది. దాంతో మూత్రపిండాల్లోని నెఫ్రాన్లు శక్తికి మించి శ్రమించడం వల్ల కణజాలం వాపుకు గురై, స్కారింగ్ మొదలవుతుంది. ఒక భోజనంలో కనిష్టంగా 30 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవచ్చు. ఇందుకోసం చికెన్, గుడ్లు, చేపలు లాంటి కిడ్నీలు వడగట్టడానికి వీలుండే ప్రొటీన్‌ను తీసుకోవాలి. కిడ్నీ డ్యామేజ్ ప్రారంభ దశలో ఉన్న వారు ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం ఆపేసిన వెంటనే మూత్రపిండాల పనితీరు 67ు పెరగడం, మూత్రపిండాల్లో రాళ్లు 14 వారాల్లో కరిగిపోవడం, క్రియాటిన్ మోతాదులు తగ్గడాన్ని డాక్టర్ రిచర్డ్ తన పరిశీలనలో గమనించారు. ప్రొటీన్ పౌడర్లు మూత్రపిండాలను దెబ్బతీస్తాయనడానికి పలు ఉదాహరణలు కూడా ఆయన సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు ప్రొటీన్ షేక్స్ తాగే బాడీబిల్డర్లు 50 ఏళ్ల వయసుకే డయాలసిస్ మీద ఆధారపడుతున్నట్టు, ఈ అలవాటు లేని వెయిట్ లిఫ్టర్ల మూత్రపిండాలు 70 ఏళ్లకు కూడా ఆరోగ్యంగా ఉంటున్నట్టు ఆయన పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..
సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..