కళ్లు కాంతివంతంగా...
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:17 AM
అధిక పని ఒత్తిడి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్ల కారణంగా కళ్ల చుట్టూ వాపు పెరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు...
అధిక పని ఒత్తిడి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్ల కారణంగా కళ్ల చుట్టూ వాపు పెరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం, కళ్లు త్వరగా అలసిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని నివారించే చిట్కాలివే...
గులాబీ నీటిలో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని అరగంట విశ్రాంతి తీసుకోవాలి. ఆపైన చల్లటి నీటితో కడిగేసుకుంటే అలసట తీరి కళ్లు ప్రకాశవంతంగా మారతాయి. ఎ విటమిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే పాలకూర, అవకాడో, కివీ పండ్లు, అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్‌నట్స్, బాదం, సోయాబీన్స్, చేపలను తరచూ ఆహారంలో చేర్చుకుంటే కళ్లకు ఉపశమనం లభిస్తుంది.
ఉడికించిన కోడిగుడ్లు, కేరట్లు, చిలగడ దుంపలు, నారింజ, ద్రాక్షలను తీసుకుంటుంటే సరైన పోషణ అంది కళ్లు తేమగా ఉంటాయి. కళ్లు ఎరుపెక్కడం, మండడంలాంటివి రావు.
రాత్రి పడుకునేముందు టమాటా లేదా ఆలుగడ్డ రసాన్ని కళ్ల కింద అప్లయ్ చేసుకుని ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే నల్లటి వలయాలు మాయమవుతాయి. రోజూ బాదం నూనె, ఇ విటమిన్ ఆయిల్, జోజోబా ఆయిల్ రాసుకుంటున్నా ఫలితం ఉంటుంది.
కీరను చక్రాల్లా కోసి పావుగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై వీటిని కళ్లపై ఉంచుకుని గంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై కళ్ల చుట్టూ వాపు తగ్గుతుంది.
పోషకాహారం తీసుకుంటూ రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటే ఎలాంటి కంటి సమస్యలూ దరి చేరవు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్