మనీ ప్లాంట్ ముడుచుకోకుండా
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:32 AM
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కోసారి మనీ ప్లాంట్ ఆకులు ముడుచుకొని వడలిపోతూ ఉంటాయి. అలాకాకుండా మనీ ప్లాంట్ పచ్చగా ఏపుగా పెరగాలంటే ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం..
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కోసారి మనీ ప్లాంట్ ఆకులు ముడుచుకొని వడలిపోతూ ఉంటాయి. అలాకాకుండా మనీ ప్లాంట్ పచ్చగా ఏపుగా పెరగాలంటే ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం..
మట్టి మరీ మెత్తగా కాకుండా కాస్త ఇసుక పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నీటిని నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు తడారిపోయే స్వభావం ఉన్న మట్టి అయితే మనీ ప్లాంట్‌కు అనుకూలంగా ఉంటుంది. కుండీల్లో పెంచుతున్నట్లయితే వాటి అడుగు భాగంలో కాస్త పెద్ద సైజు రంధ్రాలు చేయాలి. అప్పుడే అదనపు నీరు బయటికి వెళుతుంది. లేదంటే నీరు నిల్వ ఉండి వేర్లు దెబ్బతింటాయి.
ఈ మొక్కకు ఎక్కువగా నీటిని అందించకూడదు. మట్టి పొడిగా కనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా నీటిని చిలకరిస్తే సరిపోతుంది.
మనీ ప్లాంట్‌కు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. కొద్దిగా వెలుతురు సోకితే చాలు ఈ మొక్క పెద్ద పెద్ద ఆకులతో ఏపుగా పెరుగుతుంది.
సేంద్రీయ ఎరువులు లేదా ద్రవరూప ఎరువులను మితం గా మట్టిలో కలిపితే మనీ ప్లాంట్ చక్కగా పెరుగుతుంది.
ఆకులపై పడిన దుమ్మును తడి గుడ్డతో మెల్లగా తుడవాలి. అప్పుడే ఆకులు కాంతిని వేగంగా గ్రహించగల్గుతాయి. ఆకుల వెనకభాగంలో ఏవైనా క్రిమి కీటకాలు కనిపిస్తే వాటిని వెంటనే తొలగించాలి. పసుపు నీళ్లు లేదా వేపాకులు మరిగించిన నీళ్లను మొక్కపై పిచికారీ చేయాలి.
అత్యధిక వేడి, చలి కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది.
పసుపు రంగులోకి మారిన ఆకులను, ఎండిన కొమ్మలను, పొడవాటి అదనపు తీగలను తొలగిస్తూ ఉంటే కొత్త చిగుర్లు వచ్చి మొక్క పచ్చగా గుబురుగా పెరుగుతుంది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్