మూత్రపిండాల్లో రాళ్లు ఆహార నియమాలు
ABN , Publish Date - May 19 , 2026 | 02:36 AM
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే ఆ ఆహార నియమాలు ఎలా పాటించాలో తెలుసుకుందాం!...
తెలుసుకుందాం
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే ఆ ఆహార నియమాలు ఎలా పాటించాలో తెలుసుకుందాం!
టమాటా: వీటిలో ఆక్సలేట్స్ చాలా తక్కువు. పైగా వీటిలో మూత్రపిండాల్లో రాళ్లకు అడ్డుకట్ట వేసే సిట్రేట్ ఉంటుంది. కాబట్టి నిస్సందేహంగా తినొచ్చు
పాలకూర: వీటిలో ఆక్సలేట్స్ ఉంటాయి. వంద గ్రాముల పాలకూరలో, వెయ్యి మిల్లీగ్రాముల ఆక్సలేట్స్ ఉంటాయి. కాబట్టి పాలకూరకు దూరంగా ఉండాలి
ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే పాలకూర, చాక్లెట్స్, డ్రైఫ్రూట్స్ తినాలనుకుంటే, ఆ రోజు క్యాల్షియం ఎక్కువగా ఉండే, పాలు, పెరుగు ఆహారంలో చేర్చుకోవాలి. క్యాల్షియం, పేగుల్లోని ఆక్సలేట్స్‌ను అడ్డుకుని, శోషణను నియంత్రిస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్