Share News

నేరేడు పండ్లు తిందాం

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:30 AM

వేసవికాలం చివరలో విరివిగా లభించే నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...

నేరేడు పండ్లు తిందాం

వేసవికాలం చివరలో విరివిగా లభించే నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...

  • నేరేడు పండ్లలో పీచులు అధికం. ఈ పండ్లను తినడం వల్ల అజీర్తి, మలబద్దకం, కడుపులో ఆమ్లత్వం, విరేచనాలు లాంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో పుండ్లు ఏర్పడవు.

  • ఈ పండ్లను తిన్న తరువాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. వీటిలో కేలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • నేరేడు పండ్లలో ఉండే సమ్మేళనాలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇవి ఔషధంలా పనిచేస్తాయి.

  • రోజుకి అయిదు నేరేడు పండ్లు తింటే శరీరానికి కావాల్సిన పొటాషియం అందుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. పక్షవాతం సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

  • నేరేడు పండ్లలో సి విటమిన్‌, ఐరన్‌ అత్యధికంగా ఉంటాయి. వీటి వల్ల రక్తంలో హెమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. రక్తహీనత, నీరసం దరిచేరవు. నోటి పూత, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.

  • నేరేడు పండ్లను తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. శరీరంలోని ఇతర వ్యర్థాలు కూడా సులువుగా బయటికి వెళతాయి. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మొటిమల బాధ తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

Updated Date - Jun 08 , 2026 | 02:31 AM