బద్ధకం వదిలేదెలా?
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:15 AM
ఏ పని మీదా శ్రద్ద లేకుండా బద్దకంగా అనిపించినప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి...
ఏ పని మీదా శ్రద్ద లేకుండా బద్దకంగా అనిపించినప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి...
రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పట్టే పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తిచేయాలి. దీంతో బద్ధకం వదిలిపోతుంది.
ఏ పనీ చేయాలనిపించనప్పుడు మనసులో అయిదు అంకెలను లెక్కబెట్టాలి. ఇలా రెండు మూడుసార్లు చేస్తే మనసు మారి పని పూర్తి చేయాలనిపిస్తుంది.
ఉదయం లేదా సాయంత్రాల్లో స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తుంటే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి, ఉత్సాహంగా అనిపిస్తుంది.
ఇంటి పని, ఆఫీసు పని తదితరాలను పూర్తి చేయడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. దీంతో సమయానికి పని పూర్తిచేయాలనే భావన కలిగి బద్ధకం తగ్గుతుంది.
గంటకోసారి కొద్దిగా మంచినీటిని తాగుతూ ఉంటే నీరసం తగ్గుతుంది. రోజూ పోషకాహారం తీసుకుంటుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహం పెరిగి పని త్వరగా పూర్తి చేయాలనిపిస్తుంది.
ఏదైనా పని చేస్తున్నప్పుడు అరగంటకోసారి తప్పనిసరిగా విరామం తీసుకోవాలి. దీనివల్ల పెద్ద పనులు కూడా చిన్న భాగాలుగా మారి త్వరగా పూర్తిచేయవచ్చన్న భావనను కలిగిస్తాయి. బద్ధకం దరిచేరదు.
రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్