Share News

ఇవి తినాలి...

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:48 AM

శరీరంలో అవయవాలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం...

ఇవి తినాలి...

శరీరంలో అవయవాలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • ఏకాగ్రతతోపాటు మెదడు చురుకుదనం పెరిగేందుకు రోజూ కొన్ని వాల్‌నట్స్‌ తినాలి. అలాగే బ్లూ బెర్రీస్‌, మితంగా డార్క్‌ చాక్లెట్‌ తినడం మంచిది.

  • ఎలాంటి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే తరచూ అవకాడో తింటుండాలి. ఓట్స్‌, చేపలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.

  • క్యారెట్లు, పాలకూర, ఉడికించిన కోడిగుడ్లను భోజనంలో చేర్చుకుంటే దృష్టి సమస్యలు దరికి రావు. కంటి చూపు మెరుగుపడడంతోపాటు కళ్లు ప్రకాశంతంగా మారతాయి.

  • చర్మం పొడిబారకుండా తేమతో నిండి బిగుతుగా కనిపించేందుకు రోజూ నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవాలి. నారింజ పండ్లు తినాలి. టమాటాలను ఆహారంలో చేర్చుకోవాలి.

  • కాలేయం ఆరోగ్యంగా పనిచేసేందుకు వెల్లుల్లి రెబ్బలు, బీట్‌రూట్‌, నిమ్మరసం తోడ్పడతాయి.

  • మూత్రపిండాల సమస్యలను నివారించేందుకు పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, కీరా ముక్కలు తింటుండాలి.

  • తక్షణ శక్తి కోసం రోజూ అరటి పండ్లు తినాలి. తేనె, ఖర్జూరాలు కూడా నీరసాన్ని తగ్గించడానికి తోడ్పడతాయి.

  • జీర్ణక్రియ వేగవంతమయ్యేందుకు కొత్తిమీర, పుదీనా, బచ్చలి, పాలకూర, అల్లం, సోంపు, ఉసిరి పొడి, పలుచని మజ్జిగలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. బొప్పాయి, యాపిల్‌ పండ్లు తినాలి.

  • శరీరంలో జీవక్రియలన్నీ సజావుగా జరిగేందుకు రోజుకు రెండుసార్లు గ్రీన్‌ టీ తాగాలి.

  • నోటి ఆరోగ్యం కోసం పాలు, పనీర్‌, చీజ్‌, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, మొలకలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 12:48 AM