ఇలా శుభ్రం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:52 AM
ఫ్రిజ్ డోర్ అంచుల్లో ఉండే రబ్బర్ సీల్ లోపల తరచూ మురికి చేరుతుంటుంది. దీన్ని ఎలా శుభ్రం చేయాలంటే...
ఫ్రిజ్ డోర్ అంచుల్లో ఉండే రబ్బర్ సీల్ లోపల తరచూ మురికి చేరుతుంటుంది. దీన్ని ఎలా శుభ్రం చేయాలంటే...
ఈ రబ్బర్ సీల్ లోపల ఆహార పదార్థాల అవశేషాలు, తేమ, దుమ్ము పేరుకుపోయి క్రమంగా నల్లమచ్చలు ఏర్పడవచ్చు. వీటిని జాగ్రత్తగా పొడి చేతి రుమాలుతో తుడుస్తూ శుభ్రం చేయాలి. ఆ సమయంలో రబ్బర్ సీల్ ముడుతలను గట్టిగా సాగదీయకూడదు.
గిన్నెలో గోరువెచ్చటి నీటిని తీసుకుని నాలుగైదు చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. అందులో ఇయర్ బడ్స్ లేదా పాత టూత్ బ్రష్‌ను ముంచి దానితో రబ్బర్ సీల్ ముడుతలను శుభ్రం చేయవచ్చు.
చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి. దీన్ని పాత టూత్‌బ్రష్‌తో అద్దుతూ సీల్ ముడుతల లోపల రాసి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత పలుచని చేతి రుమాలుతో తుడిచేస్తే మురికి, జిడ్డు, బూజు పూర్తిగా తొలగిపోతాయి.
కప్పు నీటిలో చెంచా వెనిగర్ వేసి కలిపి అందులో ముంచిన స్పాంజ్‌తో తుడుస్తూ రబ్బర్ సీల్‌ను శుభ్రం చేయవచ్చు.
బాగా మురికిగా ఉన్న చోట తెల్లటి టూత్‌పేస్టు రాసి రెండు నిమిషాల తరువాత పలుచని గడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.
శుభ్రం చేసిన తరువాత ఈ రబ్బర్ సీల్ లోపల తడి లేకుండా ఆరనివ్వాలి. లేదంటే తేమ వల్ల ఫంగస్, బూజు ఏర్పడి సీల్ పాడయ్యే ప్రమాదముంటుంది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు