Share News

కడుపుబ్బరం బలాదూర్‌

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:31 AM

కొన్ని అలవాట్లు కడుపుబ్బరాన్ని పెంచుతాయి. అవేంటంటే...

కడుపుబ్బరం బలాదూర్‌

ఇదీ విషయం

కొన్ని అలవాట్లు కడుపుబ్బరాన్ని పెంచుతాయి. అవేంటంటే...

శీతల పానీయాలు: వీటితో పేగుల్లోకి గ్యాస్‌ చేరుకుంటుంది. సోడా, శీతల పానీయాలు కార్బన్‌ డయాక్సైడ్‌ను నేరుగా పేగుల్లోకి చేరుస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

పచ్చి కూరగాయలు: బ్రొకొలి, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ జీర్ణమయ్యేలోపే పులిసిపోతాయి. ఈ క్రూసిఫెరస్‌ కూరగాయల్లో మన పేగులు జీర్ణించుకోలేని రఫినోస్‌ అనే చక్కెర ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా పులిసి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బీన్స్‌, లెగ్యూమ్స్‌: బీన్స్‌లో పులిసే ఫైబర్‌ ఉంటుంది. పైగా ఆలిగోశాకరైడ్స్‌ను, బ్యాక్టీరియా ఇష్టంగా తింటాయి. కాబట్టి బీన్స్‌తో కడుపుబ్బరం ఉన్నవారు మితంగా తినాలి. పప్పుదినుసులను నానబెట్టి వండుకోవాలి.

ఉల్లి, వెల్లుల్లి: ఈ రెండిట్లో ఫ్రక్టోస్‌ ఎక్కువ. ఈ కార్బొహైడ్రేట్‌ సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారినీ, ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ ఉన్నవారినీ ఇబ్బంది పెడుతుంది.

పాల ఉత్పత్తులు: పాలు, పన్నీర్‌, మీగడ కడుపుబ్బరాన్ని పెంచే తత్వం కలిగి ఉంటాయి. జీర్ణంకాని లాక్టోస్‌ పెద్దపేగుల్లోకి చేరి పులుస్తుంది. కాబట్టి పాల ఉత్పత్తులతో కడుపుబ్బరం సమస్య ఉన్నవారు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి.

వేపుళ్లు: ఎక్కువ కొవ్వులున్న ఆహారం జీర్ణక్రియను కుంటుపరుస్తుంది. దాంతో ఆహారం ఎక్కువసేపు పొట్టలోనే ఉండిపోయి, పులిసిపోయి, ఎక్కువ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 11 , 2026 | 12:31 AM