Share News

ముఖం మెరిసేలా...

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:36 AM

ముఖం తాజాగా కాంతివంతంగా మెరిసేందుకు పాటించాల్సిన చిట్కాలివే...

ముఖం మెరిసేలా...

ముఖం తాజాగా కాంతివంతంగా మెరిసేందుకు పాటించాల్సిన చిట్కాలివే...

  • రాత్రి పడుకునేముందు ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. మొదట క్లెన్సింగ్‌ ఆయిల్‌తో తరువాత ఫేస్‌ వాష్‌తో రుద్ది గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మంపై పేరుకున్న మురికి పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌ రావు.

  • ఉదయం, సాయంత్రం వేళల్లో ముఖానికి రెండు చుక్కల కొబ్బరి నూనెను పట్టించి అయిదు నిముషాలు కింది నుంచి పైకి నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఆపైన గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

  • ముఖంపై రోజుకు అయిదారుసార్లు టోనర్‌ను అప్లయ్‌ చేయాలి. దీనివల్ల చర్మం తేమతో నిండి తాజాగా కనిపిస్తుంది.

  • గులాబీ నీళ్లను చేత్తో తీసుకుని ముఖంపై రాస్తూ నెమ్మదిగా తడుతుంటే చర్మం లోపలి పొరల్లోకి తేమ ఇంకుతుంది. ఫలితంగా చర్మం బిగుతుగా ఛాయగా మారుతుంది.

  • ముఖానికి టోనర్‌ అప్లయ్‌ చేసిన తరువాత ఖరీదైన ఫేస్‌ క్రీమ్‌లు, సీరమ్‌లకు బదులు కలబంద గుజ్జు, బియ్యం కడిగిన నీళ్లు, పచ్చి పాలను పట్టిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. ముఖంపై ముడుతలు, గీతలు ఏర్పడవు.

  • ముఖానికి తరచూ సన్‌స్ర్కీన్‌ రాసుకుంటుంటే పిగ్మెంటేషన్‌, మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌ లాంటి సమస్యలు రావు.

  • వారానికి మూడుసార్లు ముఖానికి ఫేస్‌ క్రీమ్‌ను పట్టించి దవడ నుంచి చెవులవైపునకు, ముక్కు నుంచి చెంపల వైపునకు పైకి మర్దన చేయాలి. ఇలా అయిదు నిముషాలు చేస్తే రక్తప్రసరణ సజావుగా జరిగి ముఖం ఉబ్బు తగ్గుతుంది. డబుల్‌ చిన్‌ సమస్య రాదు.

  • బియ్యం కడిగిన నీళ్లను గిన్నెలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ నీటిని రోజూ ముఖంపై స్ర్పే చేసుకుంటూ ఉండాలి. ఈ నీటితోనే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు తొలగి ముఖం నున్నగా మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి:

దసరా టు డిసెంబర్.. బాక్సాఫీస్ బరిలో పొరుగు సినిమాలు

సీమ పౌరుషం తర్వాత ఉత్తరాంధ్ర కళకు జై కొట్టిన నారా లోకేష్..

ట్రోలర్‌కు అదిరిపోయే కౌంటరిచ్చిన ఆది సాయికుమార్.. పోస్ట్ వైరల్

Updated Date - Oct 11 , 2026 | 01:36 AM