పొద్దున్నే గుడ్లు తింటే?
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:38 AM
ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగుతాం! కానీ రక్తంలో చక్కెర మోతాదులు రోజంతా స్థిరంగా కొనసాగాలంటే, పరగడుపున గుడ్లు తినాలి. ఎందుకంటే...
ఫుడ్ ఫ్యాక్ట్
ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగుతాం! కానీ రక్తంలో చక్కెర మోతాదులు రోజంతా స్థిరంగా కొనసాగాలంటే, పరగడుపున గుడ్లు తినాలి. ఎందుకంటే...
ఉదయం నిద్ర లేచిన వెంటనే గుడ్డు తినడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉధృతి నెమ్మదిస్తుంది. అలాగే గుడ్డులోని ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణప్రక్రియను నెమ్మదింపచేసి, రక్తంలో చక్కెర మోతాదులు రోజంతా స్థిరంగా ఉంటాయి. ప్రతి ఉదయం మన శరీరం, కార్టిసాల్ అవేకనింగ్ రెస్పాన్స్‌కు గురవుతుంది. నిద్ర మత్తును వదిలించి చురుగ్గా ఉంచడం కోసం మన శరీరంలో ఏర్పాటైన సహజసిద్ధ ఏర్పాటు అది.
ఈ సమయంలో కాఫీ తాగడం వల్ల ఆకలి క్షీణిస్తుంది. మధ్యాహ్నం లోపే శక్తి కూడా క్షీణిస్తుంది. అత్యంత నాణ్యమైన, పూర్తి స్థాయి ప్రొటీన్లు కలిగి ఉండే గుడ్డులో అన్ని తొమ్మిది అమీనో యాసిడ్లతో పాటు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెదడు, కాలేయ పనితీరులో కీలక పాత్ర పోషించే కోలీన్ ఉంటాయి.
ఉదయం అత్యధిక ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నప్పుడు, ఆకలి అదుపులో ఉండడంతో పాటు, భోజనం తర్వాత రక్తంలో చక్కెర మోతాదులు అదుపులో ఉంటాయి. కాబట్టి పరగడుపున కాఫీకి బదులుగా గుడ్డుకే ప్రాధాన్యం ఇవ్వాలి. కాఫీ తాగకుండా ఉండలేని వారు గుడ్డు తిన్న రెండు గంటల తర్వాత కాఫీ తాగొచ్చు.