వైద్యులు చెప్తున్న చిట్కాలు
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:34 AM
వెక్కిళ్లు ఎంతకూ ఆగకపోతే, రెండు చూపుడు వేళ్లూ రెండు చెవుల్లో పెట్టుకుని 7 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. దీంతో వేగస్ నాడి మీద...
తెలుసుకుందాం
వెక్కిళ్లు: వెక్కిళ్లు ఎంతకూ ఆగకపోతే, రెండు చూపుడు వేళ్లూ రెండు చెవుల్లో పెట్టుకుని 7 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. దీంతో వేగస్ నాడి మీద ఒత్తిడి పెరిగి, వెక్కిళ్లకు కారణమయ్యే డయాఫ్రమ్ సంకోచవ్యాకోచాలు అదుపులోకొస్తాయి. దాంతో వెక్కిళ్లు ఆగిపోతాయి.
ముక్కు నుంచి రక్తస్రావం: ఇలా జరిగినప్పుడు తలను వెనక్కి వంచకూడదు. బదులుగా నిమ్మచెక్క నాకాలి. లేదా పుల్లని పండు తినాలి. పులుపుతో ఒక రిఫ్లెక్స్ ప్రేరేపితమవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు వేగంగా సంకోచిస్తాయి.
వాంతి: వాంతి అయ్యే సూచనలు కనిపించిన వెంటనే, యాంటిసెప్టిక్ లేదా ఆల్కహాల్ వైప్ వాసన చూడాలి. దీంతో 30 సెకన్లలో సమస్య అదుపులోకొస్తుంది.
ఎడతెగని ఆలోచనలు: రాత్రి నిద్రకు ఆలోచనలు అడ్డొస్తూ, నిద్ర దూరమవుతుంటే, చేత్తో ఒక స్పూన్ పట్టుకోవాలి. చేతి మీదకు మళ్లే ఏకాగ్రత, వల్ల వలయాల్లా తిరిగే ఆలోచనలు ఆగిపోతాయి.
ఆందోళన: అకస్మాత్తుగా ఆందోళన ఇబ్బంది పెడితే, తెల్లగా కనిపించే గోడ, కిటికీని లేదా తెల్లని వస్తువునూ చూడాలి. దాంతో మెదడు ఆందోళన పైనుంచి ఆసక్తికరమైన దాని మీదకు దృష్టి మళ్లిస్తుంది. దాంతో ఆందోళనకరమైన ఆలోచనలు ఆగిపోతాయి.
ఇవి కూడా చదవండి..
తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..
సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..