Share News

సి సెక్షన్‌తో పొంచి ఉండే ముప్పులు

ABN , Publish Date - May 19 , 2026 | 02:34 AM

లక్షలాది మహిళల్లో తీవ్రమైన నొప్పి, గర్భధారణ సమస్యలకు సిజేరియన్‌ సర్జరీ విధానమే కారణమనే ఒక అధ్యయనం తాజాగా వెలుగులోకొచ్చింది. మరిన్ని వివరాలు....

సి సెక్షన్‌తో పొంచి ఉండే ముప్పులు

అధ్యయనం

లక్షలాది మహిళల్లో తీవ్రమైన నొప్పి, గర్భధారణ సమస్యలకు సిజేరియన్‌ సర్జరీ విధానమే కారణమనే ఒక అధ్యయనం తాజాగా వెలుగులోకొచ్చింది. మరిన్ని వివరాలు....

సి సెక్షన్‌ తర్వాత, గర్భాశయాన్ని మూసివేయడంలో భాగంగా, గర్భాశయ లోపలి పొరను చుట్టుపక్కల కండరాలకు కలిపి కుట్టేసే విధానాన్ని వైద్యులు, కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ రీసెర్చ్‌ బ్రాంచ్‌ చీఫ్‌, డాక్టర్‌ రాబర్టో రొమేరో తాజాగా ఒక అధ్యయనం ద్వారా, కొన్ని ఆసక్తికరమైన అంశాలను కనిపెట్టారు. సి సెక్షన్‌లో అనుసరించే ఈ విధానం వల్ల, గర్భాశయం తిరిగి పూర్వపు ఆకారానికి చేరుకోలేదనీ, అంతర్గత స్కారింగ్‌ వల్ల, ఎండోమెట్రియోసిస్‌ లేదా అడినోమయోసిస్‌ ముప్పు 43ు మేరకు పొంచి ఉంటుందనీ, వీటితో పాటు మూడింట రెండు వంతుల మహిళల్లో తీవ్రమైన కటి నొప్పి వేధిస్తుందనీ ఆయన కనిపెట్టారు. అలాగే తదనంతర గర్భధారణ సమయాల్లో యుటెరిన్‌ రప్చర్‌, అబ్డామినల్‌ ప్లాసెంటా అటాచ్‌మెంట్‌ లాంటి ప్రాణాంతక ముప్పులు కూడా పెరిగే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్‌ రాబర్టో కనిపెట్టారు. ఈ ముప్పులను తొలగించడం కోసం, గర్భాశయ పొర సహజసిద్ధంగా పునరుత్పత్తి జరిగే విధంగా, కండర పొరలను స్వతంత్రంగా పునర్నిర్మించే వీలున్న మరింత మెరుగైన శస్త్రచికిత్స విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రాబర్టో అంటున్నారు. ఈ కణజాల నిర్దిష్ట విధానానికి, సంప్రదాయ విధానానికి అదనంగా ఐదు నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ విధానంతో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సి సెక్షన్‌ రేట్లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపధ్యంలో, సురక్షితమైన భవిష్యత్తు ప్రసవాల కోసం, లక్షల మంది మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం ఈ వ్యూహాత్మక సర్జరీ విధానాన్ని అనుసరించడం కీలకమని వైద్యులు అంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 19 , 2026 | 02:34 AM