Share News

రంగు మారకుండా...

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:53 AM

చాకు లేదా కట్టర్‌తో కోసిన తరువాత యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉండేందుకు పాటించాల్సిన చిన్న చిట్కాలివే...

రంగు మారకుండా...

చాకు లేదా కట్టర్‌తో కోసిన తరువాత యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉండేందుకు పాటించాల్సిన చిన్న చిట్కాలివే...

  • యాపిల్‌ ముక్కలపై కొద్దిగా నారింజ రసం లేదా నిమ్మరసాన్ని స్ర్పే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటిలో ఒకదాన్ని కలిపిన నీటిలో ముక్కలను ముంచి తీసినా సమస్య తీరుతుంది. ఆ రసాల్లో ఉండే సి విటమిన్‌, సిట్రిక్‌ యాసిడ్‌.. ఆక్సిడేషన్‌ ప్రక్రియను నిలువరించడం వల్ల యాపిల్‌ ముక్కలు రంగు మారవు.

  • ఉప్పు నీటిలో యాపిల్‌ ముక్కలు వేసి అయిదు నిమిషాలు నానబెట్టి తీయాలి. గాలితో చర్య జరగడాన్ని ఉప్పు అడ్డుకుంటుంది కాబట్టి ముక్కలు రంగు మారకుండా రోజంతా తాజాగా ఉంటాయి. తినేముందు వాటిని మంచినీటిలో ముంచి తీసుకుంటే సరిపోతుంది.

  • కప్పు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె కలిపి ఆపైన యాపిల్‌ ముక్కలు వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత పళ్లెంలోకి తీస్తే తేనెలోని సహజ సమ్మేళనాలు ఆక్సిడేషన్‌ను అడ్డుకుని ముక్కలను తాజాగా ఉంచుతాయి. తేనె వల్ల వాటి రుచి, మెరుపు పెరుగుతాయి కూడా.

  • యాపిల్‌ ముక్కలపై లెమన్‌ సోడా లేదా క్లబ్‌ సోడాను స్ర్పే చేస్తే అవి చాలాసేపటి వరకు తాజాగా ఉంటాయి.

  • రంగు మారకుండా వాటిపై కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లవచ్చు.

  • యాపిల్‌ను కోసిన వెంటనే ముక్కలను గాలి చొరబడని కంటైనర్‌లో వేసి మూతబెడితే అవి ఎంతసేపయినా తాజాగానే ఉంటాయి. ముక్కలను ప్లాస్టిక్‌ ర్యాపర్‌లో చుట్టి లేదా జిప్‌లాక్‌ కవర్లో వేసి ఫ్రిజ్‌లో ఉంచినా ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 12:54 AM