Share News

ఏసీ మన్నిక కోసం...

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:50 PM

ఏసీని ఒక్కసారిగా మెయిన్‌ స్విచ్‌తో ఆపేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పడుతుంది. తరచూ ఇలా చేస్తుంటే ఏసీ పాడైపోవచ్చు. కాబట్టి ముందుగా రిమోట్‌తో ఆపి ఆ తరువాతే మెయిన్‌ స్విచ్‌ను...

ఏసీ మన్నిక కోసం...

ఏసీని ఒక్కసారిగా మెయిన్‌ స్విచ్‌తో ఆపేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పడుతుంది. తరచూ ఇలా చేస్తుంటే ఏసీ పాడైపోవచ్చు. కాబట్టి ముందుగా రిమోట్‌తో ఆపి ఆ తరువాతే మెయిన్‌ స్విచ్‌ను ఆపాలి.

  • గది చల్లబడగానే ఏసీని ఆపేసి అయిదు నిమిషాల తరువాత మళ్లీ ఆన్‌ చేయడం కొనసాగిస్తుంటే కంప్రెసర్‌ సైకిల్‌పై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతుంది. అంతేకాదు కంప్రెసర్‌ మోటార్‌ కాలిపోవచ్చు. అలాకాకుండా ఏసీని రెండు లేదా మూడు గంటలు వేసి ఉంచి ఆ తరువాత గంటసేపు విరామం ఇస్తే ఎలాంటి సమస్యలు రావు.

  • రాత్రంతా ఏసీ వేసి ఉంచి ఉదయాన్నే ఒక్కసారిగా ఆపడం మంచిది కాదు. ఆపే ముందు పది నిమిషాలు ఫ్యాన్‌ మోడ్‌లో ఉంచాలి. దీనివల్ల ఏసీ కాయిల్స్‌లో పేరుకున్న తేమ ఆరిపోతుంది. లేదంటే తేమవల్ల బూజు, ఫంగస్‌ చేరి దుర్వాసన రావడమే కాకుండా కాయిల్స్‌ త్వరగా పాడవుతాయి.

Updated Date - Jun 05 , 2026 | 11:50 PM