Health Benefits of Walnuts: వాల్‌నట్స్ తిందాం
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:18 AM
అందరూ ఇష్టపడే డ్రైఫ్రూట్స్‌లో ప్రధానమైనవి వాల్‌నట్స్. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
అందరూ ఇష్టపడే డ్రైఫ్రూట్స్‌లో ప్రధానమైనవి వాల్‌నట్స్. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెదడును చురుకుగా మారుస్తాయి. అల్జీమర్స్‌తోపాటు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుతాయి.
తరచూ వాల్‌నట్స్ తినడం వల్ల వాటిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్... రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. రక్తనాళాలను సడలించి శరీరమంతా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తాయి. వీటిని తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేము. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..