Share News

జాబ్‌ కార్నర్‌ గెయిల్‌, న్యూఢిల్లీ, ఐడీబీఐ

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:03 AM

న్యూఢిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(గెయిల్‌) - దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్‌ సెంటర్లు/ యూనిట్లలో వేర్వేరు విభాగాల్లో 70 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు...

జాబ్‌ కార్నర్‌ గెయిల్‌, న్యూఢిల్లీ, ఐడీబీఐ

గెయిల్‌, న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(గెయిల్‌) - దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్‌ సెంటర్లు/ యూనిట్లలో వేర్వేరు విభాగాల్లో 70 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: విభాగాల వారీగా కెమికల్‌-17, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-21, ఎలక్ట్రికల్‌-16, మెకానికల్‌ -16

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత డిసిప్లిన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక: గేట్‌-2026 స్కోర్‌ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 18

వెబ్‌సైట్‌: https://gailonline.com

ఐడీబీఐ

ఐడీబీఐ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 1300 పోస్టుల భర్తీకి నోటిపికేషన్‌ విడుదల చేసింది. 1100(హైదరాబాద్‌ జోన్‌లో 65) జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఒ, 200 అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఎ పోస్టులు ఉన్నాయి.

అర్హత: ‘ఒ’ పోస్టులకు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీకి తోడు ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ‘ఎ’ పోస్టులకు డిగ్రీకి తోడు రెండేళ్లు బ్యాంక్‌లో పని చేసిన అనుభవం ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 19

వెబ్‌సైట్‌: https://www.idbi.bank.in/

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 06:03 AM