ప్రభువుకు కానుక
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:48 AM
దైవానికి విధేయులుగా జీవిస్తున్నామని చెప్పుకోవడం వేరు. ఆచరించడం వేరు. తన మార్గంలో పయనించేవారు కష్టాలు పడడానికి సిద్ధంగా ఉండాలని ఏసు క్రీస్తు స్పష్టంగానే చెప్పాడు...
దైవమార్గం
దైవానికి విధేయులుగా జీవిస్తున్నామని చెప్పుకోవడం వేరు. ఆచరించడం వేరు. తన మార్గంలో పయనించేవారు కష్టాలు పడడానికి సిద్ధంగా ఉండాలని ఏసు క్రీస్తు స్పష్టంగానే చెప్పాడు. మానవాళి విముక్తి కోసం ఆయన శిలువను ఎక్కాడు. ఆ త్యాగాన్ని గౌరవిస్తూ కొన్ని సుఖాలను త్యజించడానికి మనం సిద్ధపడాలి. సమాజంలోని సాటివారిపై కోపం, పగ తగ్గించుకోవడం, తోటివారిని ప్రేమించడం, విలాసాలకు దూరంగా ఉండడం, బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకోవడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం... వీటిని ఆచరించడానికి సన్నద్ధులు కావలి. ముఖ్యంగా కోరికలను అదుపు చేసుకోవాలి. ఆపదలో ఉన్నవారిని చూసి తప్పించుకోకుండా... చేయగలిగినంత సాయం చెయ్యాలి. ఇతరులపై చాడీలు చెప్పడం, కొట్లాటలు పెంచడం, మోసకరమైన మాటలు చెప్పడం... ఇలాంటివన్నీ వ్యర్థమైనవి, ప్రభువుకు అప్రియమైనవి. దుష్ప్రవర్తన, దురాలోచన... ఇవి సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవి. అలాంటివాటిని విడనాడాలి. పంచేంద్రియాలను అదుపు చేసుకుంటూ, మితభాషణతో, సమాజానికి హితంగా నడుచుకోవడమే ఏసుకు మనం మనస్ఫూర్తిగా ఇచ్చే కానుక. మరి కొద్ది రోజులలో ఈస్టర్ రాబోతోంది. ఈ శ్రమ దినాల్లో నిష్టగా ఆచరించినవన్నీ మన వ్యక్తిగత ప్రయోజనానికే అనేది నిరంతరం గుర్తు చేసుకోవడం అవసరం.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..