కళ్లు చెదిరే కోర్సెట్ లెహంగా
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:23 AM
పెళ్లి వేడుకల్లో ఆర్భాటంగా కనిపించాలంటే కోర్సెట్ లెహంగా ఎంచుకోవాలి. సంప్రదాయం, ఆధునికత కలగలసిన ఈ మిశ్రమ లెహంగా ఫ్యూషన్ ఫ్యాషన్‌ను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి కళ్లుచెదిరే కోర్సెట్‌ను ఎలా సింగారించాలో...
ఫ్యాషన్
పెళ్లి వేడుకల్లో ఆర్భాటంగా కనిపించాలంటే కోర్సెట్ లెహంగా ఎంచుకోవాలి. సంప్రదాయం, ఆధునికత కలగలసిన ఈ మిశ్రమ లెహంగా ఫ్యూషన్ ఫ్యాషన్‌ను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి కళ్లుచెదిరే కోర్సెట్‌ను ఎలా సింగారించాలో తెలుసుకుందాం.
విభిన్నం, వినూత్నం, విలక్షణం... కోర్సెట్ లెహంగా ఈ మూడు లక్షణాలూ కలిగి ఉంటుంది. ఈ డ్రస్‌లో, ప్లాస్టిక్ లేదా స్టీల్‌తో రూపొందిన ఇంటర్నల్ బోనింగ్ వల్ల నడుము పైభాగం చక్కని ఆకృతిని సంతరించుకుంటుంది. తీర్చిదిద్దిన బ్రెస్ట్ కప్స్, స్వీట్‌హార్ట్ లేదా స్ట్రాప్‌లెస్ నెక్‌లైన్స్, లేసప్ లేదా హుక్ అండ్ ఐ బ్యాక్ క్లోజర్స్ నడుముకు చక్కగా అంటుకుపోయి, పోశ్చర్‌కు కూడా మంచి పట్టునిస్తాయి. లెహంగా పాదాల వరకూ పొడవుంటుంది. ఎక్కువ కుచ్చిళ్లు కలిగిన ప్యానల్ లేదా ఫిష్ టెయిల్ స్కర్ట్ నడుము దగ్గర బిగుతుగా, చివర్లో వెడల్పుగా చూడముచ్చటగా ఉంటుంది. ఈ లెహంగాకు దుపట్టా తప్పనిసరి కాదు. కావాలనుకుంటే లైట్ వెయిట్ స్కార్ఫ్ వేసుకోవచ్చు. కేప్‌లా భుజానికి ఒక వైపు వేలాడదీయొచ్చు.
ఫ్యాబ్రిక్స్, పనితనం
కోర్సెట్ లెహంగాలు... రా సిల్క్, వెల్వెట్, ఆర్గంజా, జార్జెట్, చందేరి సిల్క్ వస్త్రాలతో తయారవుతూ ఉంటాయి.
హంగులు: పాశ్చాత్య బోడిస్ కట్‌ను కలిగిన ఈ డ్రస్ జర్దోసి, రేషమ్, కట్‌దానా, సెక్విన్ అనే సంప్రదాయ భారతీయ చేతిపనితనాన్ని కలిగి ఉంటుంది. లోహపు దారాలు, పట్టు దారాలు, అద్దాలు, గాజు పూసలు, సెక్విన్ల హంగులు అద్దుకునే ఈ లెహంగాలు ఎంతో హూందాగా, వైభవంగా కనిపిస్తాయి.
పెళ్లిళ్లు, సంగీత్, కాక్‌టెయిల్ నైట్స్, రిసెప్షన్ లాంటి విలాసవంతమైన వేడుకలకు కోర్సెట్ లెహంగాలు తగిన దుస్తులు.
భారీ నగలు, మరీ ముఖ్యంగా సాలిటైర్స్ ఈ లెహంగాకు చక్కగా నప్పుతాయి.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!