Share News

రెడ్‌ కార్పెట్‌పై కాలర్‌బోన్‌ నెక్లెస్‌

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:05 AM

నిన్న మొన్నటి వరకూ అవార్డు ఫంక్షన్లలో, ప్రత్యేకమైన ఈవెంట్లలో స్టేట్‌మెంట్‌ ఆభరణాలు తళుక్కున మెరిసి ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించేవి. ఇప్పుడు వాటన్నింటినీ...

రెడ్‌ కార్పెట్‌పై కాలర్‌బోన్‌ నెక్లెస్‌

నిన్న మొన్నటి వరకూ అవార్డు ఫంక్షన్లలో, ప్రత్యేకమైన ఈవెంట్లలో స్టేట్‌మెంట్‌ ఆభరణాలు తళుక్కున మెరిసి ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించేవి. ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు నెట్టేసి ఎవరూ పట్టించుకోని కాలర్‌బోన్‌ నెక్లెస్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇటీవల జరిగిన ఆస్కార్‌ వేడుకలో సెలబ్రిటీలంతా వజ్రాలతో రూపొందించిన అందమైన కాలర్‌బోన్‌ నెక్లె్‌సలు ధరించి ఫ్యాషన్‌ ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతర్జాతీయ స్థాయిలో రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన కాలర్‌బోన్‌ నెక్లె్‌సల సోయగాల్ని చూద్దాం రండి..!

ప్రముఖ నటి కేట్‌ హడ్సన్‌.. గరాట్టి నుంచి ప్రత్యేకంగా తయారుచేయించుకున్న వజ్రాల నెక్లె్‌సను ధరించారు. నెక్లెస్‌ మధ్యలో 16 క్యారెట్ల ఫ్యాన్సీ గ్రీన్‌ డైమండ్‌ను పెండెంట్‌లా పొదిగి దాని చుట్టూ 50 క్యారెట్ల తెల్లని వజ్రాలను అమర్చారు. ఈ నెక్లెస్‌... ఆమె కాలర్‌బోన్‌పై చక్కగా అమరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ నటి, నిర్మాత టెయానా టేలర్‌... టిఫనీ అండ్‌ కో వారి ప్లాటినం నెక్లెస్‌ ధరించి గ్రేస్‌ఫుల్‌గా కనిపించారు. బ్లూ బుక్‌ కలెక్షన్‌లో భాగమైన ఈ నెక్లెస్‌లో 857 గుండ్రని బ్రిలియంట్‌ వజ్రాలు, 140 బాగెట్‌ వజ్రాలు, ఒక ఎమరాల్డ్‌ కట్‌ వజ్రం ఉన్నాయి. సెలెస్ట్‌ షూటింగ్‌ స్టార్‌ డిజైన్‌లో రూపొందించిన ఈ నెక్లెస్‌.. కాలర్‌బోన్‌ వద్ద అందంగా ఇమిడి అందరినీ ఆకట్టుకుంది.

హాస్య నటి యాన్‌ హ్యాత్‌వే ధరించిన నియోక్లాసికల్‌ స్టార్‌లైట్‌ హై జ్యువెలరీ నెక్లెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బల్గారి బ్రాండ్‌ డిజైనర్లు సుమారు 850 గంటలపాటు శ్రమించి ఈ నెక్లె్‌సను రూపొందించారు. ఈ వజ్రాల నెక్లెస్‌ మధ్యలో పియర్‌ కట్‌ ఎల్లో డైమండ్‌ను పెండెంట్‌లా పొదిగారు. కచ్చితమైన పొడవుతో కాలర్‌బోన్‌పై చక్కగా ఒదిగిపోయిందీ నెక్లెస్‌.

అమెరికన్‌ మీడియా పర్సనాలిటీ, ప్రముఖ వ్యాపారవేత్త అయిన కైలీ జెన్నర్‌... మాక్సిమలిజం ప్రతిబింబించేలా లొరైన్‌ స్క్వార్ట్జ్‌ వారు రూపొందించిన 200 క్యారెట్ల వజ్రాల నెక్లె్‌సను ధరించారు. మూడు పెండెంట్లతో కూడిన ఈ నెక్లెస్‌ కాలర్‌బోన్‌కు దగ్గరగా సరైన స్థానంలో తీర్చిదిద్దినట్లు అమరి అందరినీ ఆకర్షించింది.

బాలివుడ్‌ నటి ప్రియాంక చోప్రా కూడా బల్గారి బ్రాండ్‌ వారి సెర్పెంటి ఇల్యూసియో నెక్లె్‌సను పెట్టుకొచ్చారు. ఈ నెక్లె్‌సను పావే-సెట్‌ పద్ధతిలో వజ్రాలు, పచ్చలు, ఓనిక్స్‌ పొదిగి తీర్చిదిద్దారు. దీని మధ్యలో మడగాస్కర్‌కు చెందిన కుషన్‌ కట్‌ నీలమణిని పెండెంట్‌లా అమర్చారు. సుమారు 1300 గంటలపాటు శ్రమించి 235 భాగాలతో ఈ నెక్లె్‌సను ప్రత్యేకంగా రూపొందించినట్లు డిజైనర్లు చెబుతున్నారు. కాలర్‌బోన్‌ను బిగుతుగా హత్తుకుని నలువైపులా ప్రకాశాన్ని వెదజల్లుతూ ప్రతిఒక్కరినీ చూపుతిప్పుకోనివ్వకుండా చేసిందీ నెక్లెస్‌.


ప్రముఖ నటి ఛేజ్‌ ఇన్ఫినిటీ... మెటామోర్ఫోసిస్‌ సమ్మర్‌ చోకర్‌ నెక్లె్‌సను ధరించారు. 57 క్యారెట్ల వజ్రాలను ప్లాటినం, బంగారాలతో కూర్చి ఈ నెక్లె్‌సను రూపొందించారు. ఇది కాలర్‌బోన్‌ చుట్టూ గుండ్రగా అమరి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది.

ఫ్యాషన్‌ స్టయిలి్‌స్టలు ఏమంటున్నారంటే...

కాలర్‌ బోన్‌ అనేది మెడ పక్కన ఉండే ఎముక భాగం. సాధారణంగా దీన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. అలంకరణలో కూడా దీనికి ప్రాధాన్యం లేదు. కానీ ఇక్కడ సరిగ్గా ఓ నెక్లె్‌సను పెడితే మాత్రం అందరి దృష్టీ అక్కడే నిలిచిపోతుంది. దీన్ని గ్రహించిన జ్యువెలరీ డిజైనర్లు... కాలర్‌బోన్‌ను చక్కగా అంటిపెట్టుకుని, దానిచుట్టూ అందంగా అమరేలా నెక్లె్‌సలను రూపొందించి అందరికీ పరిచయం చేయడం మొదలుపెట్టారు. దీంతో అప్పటి వరకూ భారీగా ఆడంబరంగా కనిపించే స్టేట్‌మెంట్‌ ఆభరణాలను మాత్రమే మెచ్చిన సెలబ్రిటీలు క్రమంగా కాలర్‌బోన్‌ నెక్లె్‌సల వైపు మళ్లడం విశేషం. పొడవాటి హారాలు, మల్టీలేయర్డ్‌ గొలుసుల కంటే కాలర్‌బోన్‌పై సరిగా అమరిన చిన్న నెక్లెస్‌ అందరి దృష్టినీ త్వరగా ఆకర్షిస్తుంది. అంతే గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది కూడా.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

Updated Date - Apr 05 , 2026 | 06:06 AM