మన గీత మారుస్తుంది
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:45 AM
భగవద్గీత మనకు ఏం చెబుతుంది? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూనే ఉంటుంది. ఒక నాయకుడికి క్షేత్రస్థాయిలో తరచూ ఎదురయ్యే రకరకాల సవాళ్లకు భగవద్గీతలో సమాధానాలు...
వ్యాసపీఠం
భగవద్గీత మనకు ఏం చెబుతుంది? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూనే ఉంటుంది. ఒక నాయకుడికి క్షేత్రస్థాయిలో తరచూ ఎదురయ్యే రకరకాల సవాళ్లకు భగవద్గీతలో సమాధానాలు దొరుకుతాయని అనేకమంది విశ్లేషకుల భావన. ఈ క్రమంలోనే స్వామి వివేకానంద యూత్ మూమెంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బాలసుబ్రమణ్యం రాసిన ‘ది ఇన్నర్ ఛారియటీర్’ అనే పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ప్రచురించింది. దానిలో ఒక చిన్న భాగం మీ కోసం...
‘‘భగవద్గీత సిద్ధాంతాలను ప్రవచించే గ్రంఽథం కాదు. ఒక వ్యక్తిలో మార్పును తేవటానికి ఉద్దేశించిన గ్రంఽథం. భగవద్గీత వల్ల అర్జునుడిలో సమూలమైన మార్పు వచ్చింది. భయాలు, సందేహాలు, ఆశ్చర్యాలు, భవిష్యత్తు గురించి ఆశలు- మొదలైన విషయాలపై భగవద్గీత ప్రశ్నలు సంధిస్తుంది. వాటికి సమాధానాలు దొరికేదాకా మనల్ని చేయిపట్టి నడిపిస్తుంది. భగవద్గీత నాకు నాయకత్వ లక్షణాలు నేర్పించలేదు. నాయకుడిగా తయారుచేయలేదు. దైనందిక జీవితంలో ఎలా బతకాలో నేర్పించింది. ఎప్పుడైనా సందిగ్దత కలిగినప్పుడు భగవద్గీతను చదువుతాను. నా చుట్టూ ప్రపంచం తిరగడం లేదని... ఈ ప్రపంచంలో నేను చిన్న ఇరుసును మాత్రమేనని భగవద్గీత గుర్తుచేస్తుంది. నాకు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సిన అవసరం లేదనే భరోసా ఇస్తుంది. మనోసైర్థ్యంతో, నిజాయితీ, నిబద్ధతలతో నా పాత్రను నేను పోషించగలిగితే చాలని, ఫలితాన్ని మనందరిని నడిపించే శక్తికి వదిలేసి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెబుతుంది. నాయకత్వం అనేది అధికారానికి సంబంధించిన విషయం కాదు. ఒక పని సజావుగా సాగడానికి మన అవసరం ఉన్నప్పుడు... మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నాయకత్వం. భగవద్గీతలో కృష్ణుడు మనల్ని భయపెట్టడు. స్వేచ్ఛను ఎలా పొందాలో చెబుతాడు. ‘నేను’ అనే భావనను మించి ఎలా ఆలోచించాలో చెబుతాడు. ప్రస్తుతం మన ప్రపంచానికి ఇలాంటి నాయకత్వ అవసరం ఉంది. నాయకులు గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని ప్రయాణం చేస్తే చాలు.’’
ది ఇన్నర్ చారియటీర్
డాక్టర్ బాలసుబ్రమణ్యం
ప్రచురణ: పెంగ్విన్
అమెజాన్ సహా అన్ని పుస్తక దుకాణాల్లో లభిస్తుంది
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు