Best Foods for Eye Health: కళ్ల ఆరోగ్యానికి...
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:42 AM
ఒక్కోసారి కళ్లు పొడిబారి దురద, మంట లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనకు అందుబాటులో ఉండే పోషకాహారం తీసుకుంటూ వీటి నుంచి బయటపడవచ్చు...
ఒక్కోసారి కళ్లు పొడిబారి దురద, మంట లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనకు అందుబాటులో ఉండే పోషకాహారం తీసుకుంటూ వీటి నుంచి బయటపడవచ్చు.
కేరట్లలో ఎ విటమిన్ అధికంగా ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల కార్నియా ఆరోగ్యవంతంగా మారుతుంది. కళ్లు తేమగా ప్రకాశవంతంగా ఉంటాయి.
సాల్మన్, ట్యూనా, మాకెరెల్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లలో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తాయి. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు ఎరుపెక్కడం, కళ్ల మంట లాంటి సమస్యలను తగ్గిస్తాయి.
తరచూ పాలకూర, చిలగడ దుంపలు తీసుకోవడం వల్ల వాటిలోని బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లు పొడిబారకుండా కాపాడతాయి.
ఎర్రని క్యాప్సీకమ్‌లో ఎ, సి, ఇ విటమిన్లు ఉంటాయి. ఇవి కళ్లలో కణజాలం వృద్ధి పొందడానికి దోహదం చేస్తాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కళ్ల నుంచి నీరు కారడం తగ్గుతుంది.
ఉడికించిన కోడిగుడ్లు తినడం వల్ల వాటిలోని లుటిన్, జియాంక్సితిన్ సమ్మేళనాలు కలిసి కంటి సమస్యలను దూరం చేస్తాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్‌లో ఇ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కళ్లనుంచి నీరు కారడం, కళ్లు ఎరుపెక్కడం తగ్గుతాయి.
ఇవీ చదవండి:
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్