జిడ్డు వేధిస్తోందా..?
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:26 AM
జిడ్డు చర్మం ఉన్నవారికి ముఖంపై మొటిమలు, మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటివల్ల ముఖ వర్చస్సు పాడవుతుంది. అలాకాకుండా...
జిడ్డు చర్మం ఉన్నవారికి ముఖంపై మొటిమలు, మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటివల్ల ముఖ వర్చస్సు పాడవుతుంది. అలాకాకుండా ముఖంపై జిడ్డును తొలగించే చిట్కాలివే..!
తేనె లేదంటే చల్లటి పాలను ముఖానికి అప్లయ్ చేసుకుని పావుగంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే జిడ్డుకు కారణమైన సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది.
రాత్రి పడుకునేముందు పలుచని రుమాలులో ఐస్‌క్యూబ్‌ను చుట్టి దానితో ముఖంపై సున్నితంగా రుద్దినా ఫలితం కనిపిస్తుంది.
చిన్న గిన్నెలో గుడ్డులోని తెల్ల సొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలితో కొద్దికొద్దిగా తీసుకుంటూ ముఖమంతా రాయాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది.
జిడ్డుగా ఉందంటూ పదేపదే సబ్బు లేదా ఫేస్‌వా్‌షతో ముఖాన్ని కడుక్కోకూడదు. రోజుకు మూడుసార్లు ముఖంపై మంచినీటిని చిలకరించుకుని మెత్తటి టవల్‌తో అద్దుకుంటే చాలు.