Keep Blood Sugar Levels: పొరపాట్లు చేయకండి..
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:16 AM
రోజువారీ చేసే కొన్ని పొరపాట్లు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దోహదం చేస్తుంటాయి. అలాకాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...
రోజువారీ చేసే కొన్ని పొరపాట్లు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దోహదం చేస్తుంటాయి. అలాకాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...
పొట్ట తగ్గాలనో, బరువు తగ్గాలనో చాలామంది అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. దీంతో శరీరంలో చక్కెర స్థాయి బాగా తగ్గి అధికంగా తినాలనే కోరిక కల్గుతుంది. అలా తినడం వల్ల రక్తంలో ఒక్కసారిగా షుగర్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి రోజూ పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవాలి.
అన్నం, పేస్ట్రీలు, ప్యాన్ కేక్స్, మైదాతో తయారుచేసిన ఆహార పదార్థాలను అల్పాహారంగా తీసుకోకూడదు. వీటిలో అధికంగా ఉండే పిండి పదార్థాలు శరీరంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. వీటికి బదులు చిలగడ దుంపలు, పనీర్, కోడిగుడ్లు లాంటివాటితో కూడిన అల్పాహారాన్ని తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..