ఏ-లైన్ మ్యాక్సీతో హుందాగా
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:18 AM
ఏ సందర్భానికైనా అనుకూలంగా ఉంటూ ఫ్యాషనబుల్‌గా కనిపించే ఏ-లైన్ మ్యాక్సీ డ్రెస్‌లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు క్యాజువల్ వేర్‌గా వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు.
ఏ సందర్భానికైనా అనుకూలంగా ఉంటూ ఫ్యాషనబుల్‌గా కనిపించే ఏ-లైన్ మ్యాక్సీ డ్రెస్‌లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు క్యాజువల్ వేర్‌గా వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఈ డ్రెస్‌లు పై భాగంలో శరీరానికి హత్తుకుంటూ కిందికి వెళ్లే కొద్దీ వెడల్పుగా పాదాల వరకు లేదా నేలను తాకేలా ఉంటాయి. లాంగ్ గౌన్ మాదిరి హుందాగా కనిపిస్తాయి.
సన్నగా నాజూగ్గా ఉండేవారితోపాటు బొద్దుగా కనిపించేవారికి కూడా ఏ-లైన్ మ్యాక్సీలు చక్కగా నప్పుతాయి. నడుము భాగంలో ఫిట్టింగ్, కింద ఫ్లేర్ రావడం వల్ల ఈ డ్రెస్ ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. చిన్నచిన్న పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్స్, బీచ్ వెకేషన్స్, ట్రిప్‌లకు వెళ్లేటప్పుడు ధరిస్తే స్టయిలిష్ లుక్ వస్తుంది. ఫ్లోరల్, బొటానికల్ ప్రింట్స్ ఉన్న కాటన్ లేదా లెనిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్‌లు ఆఫీస్‌వేర్‌గా బాగుంటాయి. ఫ్రంట్ బటన్ డిజైన్స్, లేయర్డ్ మోడల్స్... కాలేజీ అమ్మాయిలకు ట్రెండీ లుక్‌నిస్తాయి. త్రెడ్ వర్క్, జరీ ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్‌తో ఉన్న సిల్క్ డిజైన్లను పార్టీవేర్‌గా ధరించవచ్చు. నారాయణపేట, కలంకారీ బోర్డర్లను జోడించిన ఇండో వెస్ట్రన్ ఎత్నిక్ డిజైనరీ మ్యాక్సీలకు డిమాండ్ అధికంగా ఉంటోంది.
రేయాన్, క్రేప్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లతో కూడా ఏ-లైన్ మ్యాక్సీలను డిజైన్ చేస్తున్నారు. వీ నెక్, రౌండ్ నెక్, కాలర్ నెక్, స్లీవ్‌లెస్, త్రీ-ఫోర్త్ స్లీవ్స్‌తో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. నడుముకు మ్యాచింగ్ బెల్ట్ పెట్టుకుంటే ఈ డ్రెస్ మరింత అందంగా కనిపిస్తుంది. శీతాకాలంలో దీనిపై డెనిమ్ జాకెట్ వేసుకుంటే బాగుంటుంది. క్యాజువల్ లుక్ కోసం ఈ డ్రెస్‌పై స్నీకర్స్, రకరకాల ఫ్లాట్స్ వేసుకోవచ్చు. అదే పార్టీ లుక్ కోసం మోడరన్ బ్లాక్ హీల్స్, గోల్డ్ లేదా సిల్వర్ కలర్ మెటాలిక్ శాండల్స్, ఎంబ్రాయిడరీ లేదా స్టోన్ వర్క్ జుట్టీలు ఎంపిక చేసుకోవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు