జొమాటో డెలివరీ ఫీజు రూ.2.40 మేర పెంపు
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:51 AM
ఆహారాన్ని కావాల్సిన చోటికి అందించే జొమాటో సంస్థ డెలివరీ ఫీజును రూ.2.40 మేర పెంచింది. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.
ఇకపై ప్రతి ఆర్డర్‌కు రూ.14.90 వసూలు
న్యూఢిల్లీ, మార్చి 20: ఆహారాన్ని కావాల్సిన చోటికి అందించే జొమాటో సంస్థ డెలివరీ ఫీజును రూ.2.40 మేర పెంచింది. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది. ఇంతవరకు ప్రతి డెలివరీకి జీఎస్టీ కాకుండా రూ.12.50 వంతున వసూలు చేస్తుండగా, ఇకపై రూ.14.90 వసూలు చేయనుంది. చివరిసారిగా గత సెప్టెంబరు నెలలో ఛార్జీలను పెంచింది. పోటీ సంస్థ అయిన స్విగ్గీ ప్రతి డెలివరీకి జీఎస్టీతో కలిపి రూ.14.99 వసూలు చేస్తుండడం గమనార్హం. మూడోస్థానంలో ఉన్న మ్యాజిక్‌పిన్ మాత్రం ప్రస్తుతానికి ఛార్జీలు పెంచేది లేదని తెలిపింది. ఆ సంస్థ ప్రస్తుతం ప్రతి డెలివరీకి రూ.14.20 వంతున వసూలు చేస్తోంది.