Share News

New Year Incentives: ఒక్కో డెలివరీకి రూ.150

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:31 AM

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న సమయంలో తమ డెలివరీ వర్కర్లకు కాస్త ప్రోత్సాహకం ఇస్తున్నట్టు స్విగ్గీ, జొమాటో తదితర ఈ-కామర్స్‌ సంస్థలు వెల్లడించాయి.

New Year Incentives: ఒక్కో డెలివరీకి రూ.150

  • కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేళ వర్కర్లకు ఇస్తాం: జొమాటో

  • ఈ సమయంలో రూ.2 వేల వరకు ప్రోత్సాహకాలు: స్విగ్గీ

  • వేతనాలు పెంచాలని సమ్మెకు సిద్ధమైన గిగ్‌ వర్కర్లు.. అయినా ఒక్క రోజు పెంపుతో సంస్థల సరి

న్యూఢిల్లీ, డిసెంబరు 31: కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న సమయంలో తమ డెలివరీ వర్కర్లకు కాస్త ప్రోత్సాహకం ఇస్తున్నట్టు స్విగ్గీ, జొమాటో తదితర ఈ-కామర్స్‌ సంస్థలు వెల్లడించాయి. డిసెంబరు 31న సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసే ప్రతి డెలివరీకి రూ.120 నుంచి రూ.150 చొప్పున చెల్లిస్తామని జొమాటో తెలిపింది. మొత్తంగా ఈ రోజున ఒక్కో డెలివరీ వర్కర్‌కు రూ.3 వేల వరకు అందేలా చూస్తామని పేర్కొంది. మరోవైపు డిసెంబరు 31న సాయంత్రం 6 నుంచి 12 వరకు డెలివరీ వర్కర్లకు రూ.2వేల వరకు అందేలా చూస్తామని.. 31న, 1న రెండు రోజుల్లో మొత్తంగా రూ.10 వేల వరకు ఇన్సెంటివ్‌లు అందిస్తామని స్విగ్గీ హామీ ఇచ్చినట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు. కాగా, తమకు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని స్విగ్గీ, జొమాటో, జెప్టో, తదితర ఈ-కామర్స్‌ యాప్‌ల డెలివరీ వర్కర్లు దేశవ్యాప్తంగా డిసెంబరు 31న సమ్మె చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో డెలివరీ వర్కర్లు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా అధిక వేతనం ఇచ్చేందుకు స్విగ్గీ, జొమాటో సిద్ధమయ్యాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 01 , 2026 | 05:32 AM