Share News

అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన విచారకరం

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:14 AM

గత వారం ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సు వద్ద యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న నిరసన ప్రదర్శన నిర్వహించడాన్ని పలువురు విద్యావేత్తలు తప్పుబట్టారు.

అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన విచారకరం

  • 160 మంది విద్యావేత్తల సంయుక్త ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: గత వారం ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సు వద్ద యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న నిరసన ప్రదర్శన నిర్వహించడాన్ని పలువురు విద్యావేత్తలు తప్పుబట్టారు. ఇది తీవ్ర విచారకరమని, తప్పుడు ఆలోచన అని దాదాపు 160మంది విద్యావేత్తలు సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఇది చట్టబద్ధమైన ప్రజాస్వామ్య అసమ్మతికి, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను కాపాడుకునే ఆవశ్యకత మధ్య తేడాను గుర్తించడంలో ప్రతిపక్ష పార్టీ అసమర్థతను ప్రతిబింబిస్తుందని విమర్శించారు. ప్రతిష్ఠాత్మక ఏఐ సదస్సు దేశీయ రాజకీయ ప్రచారానికి వేదిక కాదన్నారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో జేఎన్‌యూ వీసీ శాంతిశ్రీ, ఐఐటీ రూర్కీ డైరెక్టర్‌ కమల్‌ కిషోర్‌, ఐఐటీ ధార్వాడ్‌ డైరెక్టర్‌ వెంకప్పయ్య, ఐఐటీ జోధ్‌పూర్‌ డైరెక్టర్‌ అవినాశ్‌తో పాటు పలు యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు ఉన్నారు. మరోవైపు, ఢిల్లీ ఏఐ సదస్సులో నిరసన ప్రదర్శనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మధ్యప్రదేశ్‌లో మరో ముగ్గురు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనలో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది.

Updated Date - Feb 24 , 2026 | 04:14 AM