యూత్ కాంగ్రెస్ చీఫ్‌కు ఇలా బెయిల్.. అలా స్టే
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:33 AM
ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు వద్ద ఆందోళన చేశారన్న కారణంతో అరెస్టయిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్‌కు శనివారం ఒక కోర్టు బెయిల్ ఇవ్వగా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు వద్ద ఆందోళన చేశారన్న కారణంతో అరెస్టయిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్‌కు శనివారం ఒక కోర్టు బెయిల్ ఇవ్వగా, వెంటనే మరో కోర్టు స్టే విధించింది. తొలుత మేజిస్ట్రేటు కోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అన్ని పత్రాలు, బాండ్లు పరిశీలించిన అనంతరం ఆదివారం ఉదయం జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. దీనిపై వెంటనే పోలీసులు అదనపు సెషన్స్ కోర్టులో అప్పీలు చేయగా అక్కడ స్టే లభించింది. తదుపరి విచారణ మార్చి ఆరో తేదీకి వాయిదా పడింది. జీవించే హక్కు, స్వేచ్ఛ.. రాజ్యాంగం ఆత్మ అని పేర్కొన్న మేజిస్ట్రేటు కోర్టు... కేవలం ఊహల ఆధారంగా ఎవరి స్వేచ్ఛనూ హరించలేరని వ్యాఖ్యానిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సల్ వద్ద అప్పీలు చేయగా, చిబ్ బెయిల్ ఉత్తర్వులు అమలు కాకుండా స్టే ఇచ్చారు.