Share News

ఢిల్లీలో గుంతలో పడి యువకుడి మృతి

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:45 AM

ఢిల్లీలో బైక్‌ నడుపుతూ కమల్‌ భయానీ(25) అనే యువకుడు రోడ్డు మధ్యలో తవ్విన 15 అడుగుల గొయ్యిలో పడి చనిపోయాడు.

ఢిల్లీలో గుంతలో పడి యువకుడి మృతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఢిల్లీలో బైక్‌ నడుపుతూ కమల్‌ భయానీ(25) అనే యువకుడు రోడ్డు మధ్యలో తవ్విన 15 అడుగుల గొయ్యిలో పడి చనిపోయాడు. ఢిల్లీలోని జానకిపురి ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కమల్‌ కైలా్‌సపురిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేటు బ్యాంకు కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ గుంతలో పడిపోయాడు. ఢిల్లీ జల్‌ బోర్డు ఈ గొయ్యిని తవ్వింది. అయితే, కమల్‌ ప్రయాణించిన రోడ్డును ఐదు రోజులుగా మూసివేశారని, గొయ్యిని గురువారమే తవ్వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ముగ్గురు జల్‌ బోర్డు ఇంజనీర్లను సస్పెండ్‌ చేసింది.

Updated Date - Feb 07 , 2026 | 03:45 AM