Share News

యూపీలో 1.27 కోట్ల హిందూ ఓట్లు గల్లంతు

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:00 AM

ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల జాబితా నుంచి సుమారు 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు.

యూపీలో 1.27 కోట్ల హిందూ ఓట్లు గల్లంతు

  • సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపణ

లఖ్‌నవూ, అక్టోబరు 31: ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల జాబితా నుంచి సుమారు 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. జనాభా లెక్కల ప్రకారం యూపీలో 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 13 కోట్ల మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న 55 లక్షల మంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేవని ఆరోపించారు. అలాగే 18- 19 ఏళ్ల వయసున్న సుమారు 4.5 లక్షల మంది యువత పేర్లు కూడా జాబితాలో గల్లంతయ్యాయని పేర్కొన్నారు. గత ఎస్‌ఐఆర్‌తో పోలిస్తే ఈసారి కొత్తగా 4 లక్షల మంది ఓటర్లు మాత్రమే చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, సర్‌ ప్రక్రియలో భాగంగా యూపీలో 2.04 కోట్ల మందిని ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది.

Updated Date - Nov 01 , 2026 | 03:01 AM