Share News

ఏఐ వీడియోలపై ఎక్స్‌ కఠిన వైఖరి!

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:46 AM

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో సోషల్‌ మీడి యా ప్లాట్‌ఫాం ‘ఎక్స్‌’ కీలక నిర్ణయం తీసు కుంది. సరైన వివరణ లేకుండా కృత్రిమ మేధ ఉపయోగించి రూపొందించిన వీడియోలను...

ఏఐ వీడియోలపై ఎక్స్‌ కఠిన వైఖరి!

  • సరైన వివరణ లేకుండా ఆ వీడియోలు పెడితే అకౌంట్‌ క్లోజ్‌

న్యూఢిల్లీ, మార్చి 4: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో సోషల్‌ మీడి యా ప్లాట్‌ఫాం ‘ఎక్స్‌’ కీలక నిర్ణయం తీసు కుంది. సరైన వివరణ లేకుండా కృత్రిమ మేధ ఉపయోగించి రూపొందించిన వీడియోలను పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వాటికి ఎలాంటి ఆదాయమూ ఇవ్వబోమని తెలిపింది. ఏఐని వాడి రూపొందించే యుద్ధానికి సంబంధించిన వీడియోలకు సవివరమైన డిస్ర్కిప్షన్‌ ఇవ్వకుంటే వారికి భారీ జరిమానాలు తప్పవని ఎక్స్‌ తెలిపింది. అలాగే, 90 రోజుల వరకూ సంబంధిత ఖాతాను నిలిపివేస్తామని, అయినా మారకుంటే ఆయా ఖాతాలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈమేరకు ఎక్స్‌ ఉత్పత్తుల హెడ్‌ నికిత బెయిర్‌ ఒక పోస్టు పెట్టారు. ‘ప్రస్తు తం ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూ పొందిస్తున్న చాలా వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయి. సదరు వీడియోలు కృత్రిమ మేధ ఉపయోగించి రూపొందించినట్లు వివరణలు ఆయా వీడియోలపై లేనట్లైతే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Updated Date - Mar 05 , 2026 | 01:46 AM