Share News

పోలీసు బస్సు తాళాలు లాక్కొని పరార్‌!

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:03 AM

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన నిరసనలో.. ఓ మహిళ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసు బస్సు తాళాలు లాక్కొని పరార్‌!
woman

జంతర్‌మంతర్‌ వద్ద ఓ యువతి వినూత్న నిరసన

న్యూఢిల్లీ, అక్టోబరు 5: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన నిరసనలో.. ఓ మహిళ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆందోళన చేస్తున్న నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తరలించేందుకు బస్సును సిద్ధం చేశారు. బస్సు బయలుదేరే సమయానికి హఠాత్తుగా అక్కడకు వచ్చిన సదరు మహిళ, డ్రైవర్‌ సీటు వైపు నుంచి చాకచక్యంగా తాళాలు లాక్కొని జనాల్లోకి పారిపోయింది. తాళాలు లేకపోవడంతో డ్రైవర్‌ బస్సును కదల్చలేకపోయాడు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక ఆ వాహనాన్ని నిరసన స్థలం నుంచి చేతులతో నెట్టుకుంటూ దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది.

Updated Date - Oct 06 , 2026 | 06:04 AM