Share News

ఆరేళ్ల తరువాత ‘హతురాలు’ ప్రత్యక్షం

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:46 AM

హత్య కు గురైనట్టు భావించిన మహిళ ఆరేళ్ల తరువాత ప్రత్యక్షమైంది. కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురానికి చెందిన నాగరాజు కుమార్తె మంజు(35)కు..

ఆరేళ్ల తరువాత ‘హతురాలు’ ప్రత్యక్షం

  • ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు

  • విచారణ ఖైదీగా రెండేళ్లు జైల్లో బాధితుడు

బెంగళూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): హత్య కు గురైనట్టు భావించిన మహిళ ఆరేళ్ల తరువాత ప్రత్యక్షమైంది. కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురానికి చెందిన నాగరాజు కుమార్తె మంజు(35)కు శ్రీరంగపట్టణ తాలూకా నీలికొప్పలు గ్రామానికి చెంది న మంజునాథ్‌తో పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా 2019 మే నెలలో మంజు పుట్టింటికి వచ్చారు. మంజు తల్లి అప్పటికే మృతి చెందడంతో పాండవపురలో తండ్రీకూతురు మాత్ర మే ఉండేవారు. అదే ఏడాది జూన్‌ 23వ తేదీ రాత్రి నాగరాజు సెక్యూరిటీ విధులకు వెళ్లగా, మంజు ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. జూలై 3న నాగరాజు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే తాలూకాలోని రాగిముద్దేనహళ్లికి చెందిన రాజేశ్‌ అనే వ్యక్తితో మంజు సన్నిహితంగా ఉండేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో మంజును రాజేశ్‌ హత్య చేశాడని 2021 జూలై 23న పోలీసులకు నాగరాజు మరో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మృతదేహం కోసం గాలించినా లభించకపోవడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో రెండేళ్లపాటు జైలులో విచారణ ఖైదీగా ఉన్న రాజేశ్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో హత్యకు గురైందని భావిస్తున్న మంజు, రామనగర్‌ జిల్లా మాయగొండనహళ్లిలోరాజేశ్‌ తండ్రి రమేశ్‌కు కనిపించింది. దీంతో ఆయ న నాగమంగళ తాలూకా బిండగనవిలె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి మంజును అదుపులోకి తీసుకున్నారు. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని, అందుకే తన ప్రియుడు నాగేంద్రతో కలిసి వెళ్లిపోయానని మంజు తెలిపారు.

Updated Date - Nov 13 , 2026 | 02:47 AM