Wings India 2026: హైదరాబాద్‌లో ‘వింగ్స్ ఇండియా 2026’
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:26 AM
హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయం ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా 2026’కు వేదిక కానుంది.
28 నుంచి 31 వరకు బేగంపేటలో వేడుకలు
న్యూఢిల్లీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయం ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా 2026’కు వేదిక కానుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభించనున్నారు. ‘ఇండియన్ ఏవియేషన్: పేవింగ్ ద ఫ్యూచర్’ అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ ప్రదర్శనలో విమానాల తయారీ, డిజైన్, నిర్వహణ, భద్రత వంటి కీలక అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో సందర్శకులను కట్టిపడేసే ఎయిర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యువత కోసం ఏవియేషన్ జాబ్ మేళాను, విద్యార్థుల కోసం ‘సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.