నేటి నుంచి ఏవియేషన్ షో
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:07 AM
రెండేళ్లకోసారి నిర్వహించే విమానాల పండుగ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానుంది..
బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా 4 రోజులు ప్రదర్శన
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్), హైదరాబాద్ సిటీ: రెండేళ్లకోసారి నిర్వహించే విమానాల పండుగ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ‘వింగ్స్ ఇండి యా 2026’ పేరుతో 4 రోజులు జరగనున్న ఈ మెగా ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు ప్రారంభించనున్నారు. దేశ, అంతర్జాతీయ విమాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థ లు ఇందులో పాలుపంచుకోనున్నాయి. పలు దేశాలకు చెందిన మంత్రుల స్థాయి బృందాలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు సైతం హాజరు కానున్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వాటి వైమానిక రంగ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధిని ప్రదర్శించనున్నాయి. అంతర్జాతీయ ఎగ్జిబిషన్, విమానాలు, హెలీకాప్టర్ల ప్రదర్శనతోపాటు భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శన, ఫ్లైయింగ్ అండ్ ఏరోబాటిక్ షోలు జరగనున్నాయి.