రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ‘ప్రొటోకాల్ ఉల్లంఘన’పై కేంద్రానికి నివేదిక
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:56 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపినట్టు సోమవారం...
కోల్‌కతా, మార్చి 9: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపినట్టు సోమవారం అధికారవర్గాలు తెలిపాయి. బ్లూ బుక్ ప్రకారం అమలు చేయాల్సిన ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడంపై సమాధానం ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నివేదికను సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందినీ చక్రవర్తి...కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌కు దీనిని పంపించారు. ఇదిలా ఉండగా, అడ్వాణీకి భారతరత్న ప్రదానం సందర్భంగా రాష్ట్రపతి నిల్చొని ఉన్నప్పుడు ప్రధాని మోదీ కుర్చీలో కూర్చొన్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణపై బీజేపీ వివరణ ఇచ్చింది. భారతరత్న ప్రదానం చేస్తున్నప్పుడు రాష్ట్రపతి తప్పా ఇతరులు ఎవరూ నిల్చోకూడదన్నది ప్రొటోకాల్ అని పేర్కొంది.