‘వలసల’పై బెంగాల్ ఉక్కుపాదం
ABN , Publish Date - May 25 , 2026 | 04:01 AM
అక్రమ వలసదారులపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడి.. చట్ట విరుద్ధంగా ఉంటున్న బంగ్లాదేశీయులు...
న్యూఢిల్లీ, మే 24: అక్రమ వలసదారులపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడి.. చట్ట విరుద్ధంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను తక్షణమే నిర్బంధ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది. ఆయా జిల్లాల్లో నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పట్టుబడిన విదేశీయులు, దేశ బహిష్కరణకు గురైన వారు, జైలు నుంచి విడుదలై.. తమ తమ దేశాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న విదేశీ ఖైదీలను తక్షణమే నిర్బంధ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర హోం శాఖ లేఖలు రాసింది.