బెంగాల్ బడ్జెట్‌లో మైనారిటీ నిధుల కోత
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:11 AM
పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీ వ్యవహారాలు, మదరసా విద్యా శాఖకు బడ్జెట్‌లో...
కోలకతా, జూన్ 22: పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీ వ్యవహారాలు, మదరసా విద్యా శాఖకు బడ్జెట్‌లో ఏకంగా 50 శాతానికి పైగా కోత విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. గత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఈ శాఖకు రూ.5,713 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దాన్ని రూ.2,165 కోట్లకు పరిమితం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా సోమవారం రూ.4.38 లక్షల కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి(జూలై 6)ని రాష్ట్ర సెలవు దినంగా బెంగాల్ సర్కార్ ప్రకటించింది.