Share News

ప్రైవేట్‌ జెట్స్‌ కోసం సంపన్నుల చూపు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:28 AM

పశ్చిమాసియాలో యుద్ధం భీకరస్థాయికి చేరిన వేళ.. అక్కడి నుంచి బయటపడటానికి ప్రైవేట్‌ జెట్స్‌ కోసం అత్యంత సంపన్నులు భారీగా డబ్బు చెల్లించడానికి సిద్ధమవుతున్నారు.

ప్రైవేట్‌ జెట్స్‌ కోసం సంపన్నుల చూపు

న్యూఢిల్లీ, మార్చి 3: పశ్చిమాసియాలో యుద్ధం భీకరస్థాయికి చేరిన వేళ.. అక్కడి నుంచి బయటపడటానికి ప్రైవేట్‌ జెట్స్‌ కోసం అత్యంత సంపన్నులు భారీగా డబ్బు చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. 3.5లక్షల డాలర్లు (రూ.3.2 కోట్లు) చెల్లించి అల్ర్టా ధనవంతులు ప్రైవేట్‌ జెట్ల లో పశ్చిమాసియా ప్రాంతం నుంచి బయటకు వస్తున్నారని న్యూయార్క్‌ పోస్టు కథనంలో పేర్కొంది. బాంబులు, క్షిపణుల మోతతో దుబాయ్‌, అబుధాబిలో ఉంటున్న విదేశీ ధనవంతులు తీవ్రంగా భయపడుతున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి మార్గం చూపాలని ప్రైవేట్‌ సెక్యూరిటీ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 03:28 AM