Share News

రాబందులు మళ్లీ వస్తున్నాయ్‌..!

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:13 AM

పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాబందులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. పశువులకు వాడే డైక్లోఫినాక్‌...

రాబందులు మళ్లీ వస్తున్నాయ్‌..!

  • బ్రీడింగ్‌ సెంటర్ల ద్వారా అభివృద్ధి చేసి అడవుల్లోకి..పర్యవేక్షణకు ట్రాకర్లు

ముంబై, మే 31: పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాబందులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. పశువులకు వాడే డైక్లోఫినాక్‌ అనే పెయిన్‌ కిల్లర్‌ వల్ల భారత్‌లో దాదాపు 90 శాతానికిపైగా రాబందులు కనుమరుగయ్యాయి. అయితే ఈ మందును నిషేధించిన రెండు దశాబ్దాల తర్వాత.. ప్రభుత్వం తీసుకుంటున్న సంరక్షణ చర్యల ఫలితంగా అంతరించిపోతున్న రాబందులు మళ్లీ పునరాగమనం చేస్తున్నాయి. బ్రీడింగ్‌ సెంటర్ల ద్వారా వీటిని విజయవంతంగా అభివృద్ధి చేసి అడవుల్లోకి వదులుతున్నామని బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌) డైరెక్టర్‌ కిశోర్‌ రిథే తెలిపారు. బీఎన్‌హెచ్‌ఎస్‌, మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా.. బ్రీడింగ్‌ సెంటర్లలో తెల్ల వీపు, పొడవైన ముక్కు, సన్నని ముక్కుగల రాబందులను అభివృద్ధి చేసి హరియాణ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, అసోంలోని అడవుల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాటి భద్రతను పర్యవేక్షించడానికి జీపీఎస్‌ ట్రాకర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలా విడుదల చేసిన పొడవాటి ముక్కుగల రాబందు 17 రోజుల్లోనే 750 కిలోమీటర్లు ప్రయాణించినట్టు గుర్తించామని చెప్పారు.

Updated Date - Jun 01 , 2026 | 04:13 AM