ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా వినోద్ జాఖడ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:16 AM
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) నూతన అధ్యక్షుడిగా వినోద్ జాఖడ్ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) నూతన అధ్యక్షుడిగా వినోద్ జాఖడ్ నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకు ఎన్‌ఎ్‌సయూఐ నాయకత్వ బాధ్యతలను జాఖడ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎన్‌ఎ్‌సయూఐ చీఫ్‌గా సేవలందించిన వరుణ్ చౌదరి కృషిని ఏఐసీసీ అభినందించింది. రాజస్థాన్‌కు చెందిన జాఖడ్ గతంలో రాజస్థాన్ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీ వర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాల ఎన్నికలతో విద్యార్థి రాజకీయాలు ఊపందుకుంటున్న తరుణంలో ఆయన ఎన్‌ఎ్‌సయూఐ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.