Share News

32కు చేరిన విజయ్‌ మంత్రివర్గం

ABN , Publish Date - May 22 , 2026 | 03:23 AM

తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత సి.జోసెఫ్‌ విజయ్‌ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 32కు చేరింది. ఈ నెల 10న సీఎం విజయ్‌తో పాటు మరో తొమ్మిదిమంది మంత్రులుగా ....

32కు చేరిన విజయ్‌ మంత్రివర్గం

  • కొత్తగా 23 మంది ప్రమాణం

  • 33 మందిలో 31 మంది తొలిసారి ఎమ్మెల్యేలు

చెన్నై, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత సి.జోసెఫ్‌ విజయ్‌ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 32కు చేరింది. ఈ నెల 10న సీఎం విజయ్‌తో పాటు మరో తొమ్మిదిమంది మంత్రులుగా ప్రమా ణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకు లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అర్లేకర్‌ 23 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. అందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయ్‌ మంత్రివర్గంలో ఏడుగురు ఎస్సీలకు చోటు లభించింది. తమిళనాడు చరిత్రలో ఇదొక అరుదైన రికార్డు. మంత్రుల్లో 31 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. కాగా 50 ఏళ్లలోపు వయసున్న వారు 15 మంది మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. కాగా, జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఎట్టకేలకు 59 ఏళ్ల తరువాత తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. ఆ పార్టీ నేత కె.కామరాజ్‌ 1954 ఏప్రిల్‌ 13 నుంచి 1963 అక్టోబరు 2వ తేదీ వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికి లేకుండాపోయింది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వంలో భాగస్వామ్యం లభించింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్‌.రాజే్‌షకుమార్‌, పి.విశ్వనాఽథన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Updated Date - May 22 , 2026 | 03:23 AM