విజయ్‌తో విడాకులొద్దు..
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:25 AM
తమిళనాడు సీఎం విజయ్, ఆయన సతీమణి సంగీత విడాకుల కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ..
పిటిషన్ వెనక్కి తీసుకున్న తమిళనాడు సీఎం భార్య సంగీత
కేసు ముగిసినట్టు ప్రకటించిన కోర్టు
చెన్నై, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్, ఆయన సతీమణి సంగీత విడాకుల కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు ప్రథమశ్రేణి కుటుంబ సంక్షేమ కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత తాను ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ముగిసినట్టు న్యాయస్థానం ప్రకటించింది. విజయ్, సంగీత 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త విజయ్‌కు మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ గతేడాది సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.