Share News

వేలూరు సభలో విజయ్‌ కంటతడి

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:18 AM

రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి తమిళ ప్రజలంతా తనపై విపరీతమైన ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్నారని, తాను, తమిళ ప్రజలు వేర్వేరు కాదనే భావనతోనే...

వేలూరు సభలో విజయ్‌ కంటతడి

చెన్నై, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి తమిళ ప్రజలంతా తనపై విపరీతమైన ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్నారని, తాను, తమిళ ప్రజలు వేర్వేరు కాదనే భావనతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యానని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ నాయకుడు, నటుడు విజయ్‌ అన్నారు. వేలూరులో సోమవారం పార్టీ నిర్వాహకుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తమిళ ప్రజలను తనను విడదీసేందుకు కుట్ర జరుగుతోందంటూ కంటతడిపెట్టారు. కరూర్‌ తొక్కిసలాట ఘటనకు తానే కారణమని సీఎం స్టాలిన్‌ ఆరోపించడాన్ని ప్రస్తావించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ప్రజలకు, డీఎంకేకు మధ్య జరుగనున్న యుద్ధమని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విజయ్‌, స్టాలిన్‌ మధ్య జరగబోయే భీకర సంగ్రామమని అన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 04:18 AM